Wednesday, 17 June 2026 02:53:05 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అశ్వారావుపేట మార్పు కోసం వస్తున్న యువ కెరటం-7వ వార్డు బరిలో కొల్లి రవికిరణ్

Date : 09 February 2026 10:42 AM Views : 65

DNB News - తెలంగాణ / : అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న యువనేత, ప్రముఖ జర్నలిస్ట్ కొల్లి రవికిరణ్ పేరు ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఒకప్పుడు రాజకీయాలను శాసించిన అనుభవం, ప్రజల గొంతుకగా మారిన నేపథ్యం ఆయనను గెలుపు దిశగా నడిపిస్తున్నాయి. ​అనుభవం, పోరాటం, ఆశయం కలిగిన ​కొల్లి రవికిరణ్ అంటే కేవలం ఒక అభ్యర్థి మాత్రమే కాదు, అశ్వారావుపేట ప్రజల సమస్యల పై నిరంతరం గళమెత్తే ఒక ధీశాలి. గతంలో ఎంపీటీసీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన ఆయనకు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని రాజకీయ శక్తుల కుట్రలు, అక్రమాల వల్ల స్వల్ప మెజార్టీతో సర్పంచ్ పదవికి దూరమైనప్పటికీ, అధైర్యపడకుండా ప్రజా క్షేత్రంలోనే ఉంటూ యూత్ ఐకాన్ గా ఎదిగారు. అశ్వారావుపేట గడ్డపై దొరల గడీల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదంటూ రవికిరణ్ చేస్తున్న గర్జన ఓటర్లలో ఆలోచన రేకెత్తిస్తోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, క్షుద్ర రాజకీయాలకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా దుమ్ము, ధూళిలో మగ్గుతున్న ప్రజలకు నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు కల్పించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ​7వ వార్డు అభివృద్ధికి పక్కా ప్రణాళిక ​భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అభ్యర్థిగా గెలిస్తే 7వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రవికిరణ్ హామీ ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు. ​మౌలిక వసతులు మురుగు కాలువలు, వీధి దీపాలు, మరియు సిసి రోడ్ల నిర్మాణం, దోపిడీ శక్తుల నుండి అశ్వారావుపేటను కాపాడి, సామాన్యుడి రాజ్యానికి బాటలు వేస్తానని, మున్సిపాలిటీ గడ్డపై గులాబీ జెండా ను వార్డు ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కొల్లి రవికిరణ్ కు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన వార్డు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడిన జర్నలిస్ట్, ఇప్పుడు నేరుగా ప్రజా ప్రతినిధిగా మీ ముందుకు వస్తున్నారు. 7వ వార్డు బాగుపడాలన్నా, అశ్వారావుపేట ఆత్మగౌరవం నిలబడాలన్నా కొల్లి రవికిరణ్ విజయం అనివార్యమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :