DNB News - తెలంగాణ / : విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన కారణంగా భావిస్తున్న డాక్టర్ అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో అమర్ మరియు దీపిక మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం అమర్ మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు సమాచారం. ఇదే విషయంపై తీవ్ర మనస్తాపానికి గురైన దీపిక, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్‌లో వైద్యురాలిగా పనిచేస్తూ గత నెల 5వ తేదీన ప్రమాదకరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు అమర్‌తో దీపిక ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
Admin
DNB News