DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపాటు జరిగే ప్రజాపాలన_ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అలైవ్ _ అరైవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన గ్రామసభ. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులపాటు. వివిధ రకాల కార్యక్రమాలలో భాగంగా. నేడు రహదారి భద్రతా. విషయంలో. అలైవ్ _ అరైవ్ కార్యక్రమాన్ని. చేపట్టి. గ్రామాలలో. ఉన్న ప్రజానీకానికి సైతం అవగాహన కల్పించేందుకు. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు . ఇప్పటికే పలు రకాలుగా చర్యలు చేపట్టారని. ముఖ్యంగా ద్విచక్ర .. వాహనదారులు. ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ఉపయోగించాలని. అలాగే ఫోర్ వీలర్ వాహనదారులు.. ప్రయాణంలో ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలని మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదని . ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని. అధిక స్పీడు అనర్ధాయకమని. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని... ఎవరు రాంగ్ రూట్లో ప్రయాణించకూడదని.. ఇలా ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలను పాటించి. జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. .. తదుపరి నూతన కమిటీని ఏర్పాటు చేసి తదనంతరం. వారితో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో. వార్డ్ సభ్యులు. షేక్ అజీజ్ మియా పచ్ఛిపాల అశ్విని. పంచాయతీ కార్యదర్శి పచ్ఛిపాల వెంకటేశ్వర్లు. నూతన కమిటీ సభ్యులు. బొమ్మ సాయి వీరబోయిన వినోద్ కిన్నెర మనోజ్. అంగన్వాడి .ఆశా కార్యకర్తలు. గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News