Wednesday, 17 June 2026 02:57:41 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

చిల్లంచర్ల వరలక్ష్మి ఆశయ సాధనకు కృషి చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్

Date : 10 March 2026 10:53 AM Views : 116

DNB News - తెలంగాణ / : మునగాల:తెలంగాణసాయుధ రైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మీ ఆశయసాధన కోసం వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు, సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన చిల్లంచర్ల వరలక్ష్మి సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథిగాహాజరై మాట్లాడారు,మొదటగా సిపిఐ పార్టీ మరియు వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు చిల్లంచర్ల వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, ఆమెమృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనంపాటించారు, అనంతరం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, చిల్లంచర్ల వరలక్ష్మి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటుఅని,ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు ఆమె ఎల్లప్పుడూ భర్త అడుగుజాడల్లో నడుస్తూ స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తూ వెన్నుదన్నుగా నిలిచారన్నారు, వరలక్ష్మమ్మ ఉన్నత కుటుంబంలో పుట్టిన మహిళగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పైన పార్టీ సిద్ధాంతం పైన ఎనలేని అభిమానం చూపించేదని,తన భర్త ప్రజా పోరాటాలకు పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతల్ని ఆమె నిర్వర్తిస్తూ తనకున్న 9 మంది పిల్లల్ని పెంచి పోషించే బాధ్యతను భుజాన వేసుకున్నదని ఆయన అన్నారు,నేటితరం మహిళలకు వరలక్ష్మమ్మ జీవితం ఒక స్ఫూర్తిదాయకమని, ప్రజా ఉద్యమాల పట్ల ఆమెకున్న అంకితభావం, సేవా గుణం ఆమెను ప్రజలకు చేరువచేసిందని ఆయన అన్నారు,ఆమె సహకారం వల్లనే మునగాల పరగణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఆనాడు విస్తరించగలిగిందని ఆయన తెలిపారు, ఆమె ఆశయాలని సాధించడమే ఆమెకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయనతెలిపారు,ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులునంద్యాల రామిరెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, పైడిమరి వెంకటనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య మునగాల గ్రామఉపసర్పంచ్ కాసర్ల వెంకటేశ్వర్లు, యుగంధర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరి అజయ్ కుమార్, సత్తిబాబు, కోల ఉపేందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సిపిఎంపార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు, సిపిఐ పార్టీ నాయకులుసిహెచ్ సీతారాం, మామిడి చిన్న రాములు, రాఘవరెడ్డి, వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఠాగూర్ బాబు, కందిబండసత్యనారాయణ, గిరిబాబు, వివిధరాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు అర్వపల్లి శంకర్, ఓరుగంటి రవి, ఎల్వీ ప్రసాద్ ,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతాప సభకు హాజరైన పేద మహిళలకు వరలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు చీరల పంపిణీ చేశారు,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: