Monday, 15 June 2026 02:30:03 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎస్.ఆర్.ఆర్ కళాశాల అడ్మిషన్ల పెంపుదలకు అధ్యాపకులు కృషి చేయాలి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ

Date : 24 April 2026 10:08 AM Views : 46

DNB News - తెలంగాణ / : స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్), కరీంనగర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల పెంపుదలపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధ్యాపకులందరూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల గురించి వివరించి, విద్యార్థులు ఎస్.ఆర్.ఆర్ కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందేలా ప్రోత్సహించాలని కోరారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. రామకృష్ణ దోస్త్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను వివరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, మే 14న సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. కేటాయింపు పొందిన విద్యార్థులు మే 15 నుండి మే 23 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దోస్త్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను విద్యార్థులకు విస్తృతంగా తెలియజేయాలని అధ్యాపకులను కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్స్ పి. నితిన్, టి. రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :