Wednesday, 17 June 2026 02:07:03 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విజయానికి అడ్డదారులు ఉండవు.. విజయానికి శ్రమయే మార్గము."

Date : 26 March 2026 04:38 PM Views : 43

DNB News - తెలంగాణ / : సూర్యాపేట పట్టణం స్పందన డిగ్రీ మరియు పీజీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాల యజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విజయానికి అడ్డదారులు ఉండవని విజయం సాధించాలంటే శ్రమ మార్గమని, విద్యార్థులు నిత్యం శ్రమించాలని అన్నారు. ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అంశాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. గొప్ప విజయాలు సాధించిన వారి విజయగాతలను ఆదర్శంగా తీసుకోవాలని అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఉద్దేశించి వివరించారు. మంచి భవిష్యత్తుపై యువత కలలు కలనాలని ఆ కలలను సాకారం చేయడంలో నిరంతరం శ్రమించాలని సూచించారు. కష్టపడి చదువుకునే సమయంలో యువత ఆకర్షణలకు గురై బంగారు భవిష్యత్తును కోల్పోవద్దు, చెడు అలవాట్లకు లోనూ కావద్దు అని కోరారు. శ్రమతో వచ్చే ఫలితం తృప్తినిస్తుంది, మంచి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది అన్నారు. సైరైన సమయంలో కష్టపడే వారు ఉన్నత స్థానాలకు చేరుతారు, సరైన సమయంలో కష్టపడని వారు వెనుకాపడుతారు. యువత శ్రమించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి అని కోరారు. సమాజంలో ఉన్న సామాజిక అంశాల పట్ల, సామాజిక రుగ్మతల పట్ల యువత, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, యువత దేశాభివృద్ధికి ఉపయోగపడే వనరు, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి, హెల్మెట్ ధరించాలి, రోడ్డు పై ఉన్న చుట్టూ పరిస్థితులు గమనించి సురక్షిత గమ్యం చేరాలి. డిఫెన్సివ్ గా వాహనాలు నడపాలి అన్నారు. 60 శాతం ప్రమాదాలు ద్విచక్రవహనాల వల్ల సంభవిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మత్తు పదార్థాలు యువతను, విద్యార్థులను చిదిమెస్తున్నాయి, చిన్న పాటి ఆనందం కోసం మత్తుకు, చెడు అలవాట్లకు అలవాటుపడి వ్యసన పరులుగా మారుతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశ వల్ల సైబర్ మోసాలు జరుగుతున్నాయి, కష్టం లేకుండా కూర్చుని డబ్బు సంపాదించాలి అనుకుంటే సమస్యలు వస్తాయి. సామాజిక అంశాలు రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాల నివారణలో యువత, విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, వాసుదేవరావు, వేణుగోపాల్, నాగిరెడ్డి, మారం వెంకట్ రెడ్డి, యాదవరెడ్డి, సత్యం బాబు, భగవాన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాద్యాయులు ఉన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: