Wednesday, 17 June 2026 02:11:01 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కర్ల రాజేష్ మృతదేహానికి ఎయిమ్స్ వైద్యుల రీ-పోస్టుమార్టం

Date : 28 February 2026 11:37 AM Views : 139

DNB News - తెలంగాణ / : కోదాడ పట్టణంలో 100 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (లాకప్ డెత్) కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు రీ-పోస్టుమార్టం నిర్వహించడాన్ని ఎమ్మార్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. ​ఉద్దేశపూర్వక జాప్యంపై మండిపాటు: "రాజేష్ మరణించిన మొదటి వారంలోనే రీ-పోస్టుమార్టం చేసి ఉంటే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవి" అని మంద కృష్ణ పేర్కొన్నారు. కాలం గడిచేకొద్దీ మృతదేహం కుళ్ళిపోయి, ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే పోలీసులు 100 రోజుల పాటు కాలయాపన చేశారని ఆరోపించారు. జాతీయ ఎస్సీ కమిషన్ రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసు యంత్రాంగం వాటిని బేఖాతరు చేయడం వెనుక నిందితులను కాపాడే కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. ​ఎస్సీ కమిషన్ నోటీసుల వల్లే కదలిక: ఫిబ్రవరి 19న ఎస్సీ కమిషన్ మరలా నోటీసులు ఇవ్వడంతోనే ఇప్పుడు పోలీసులు హడావిడిగా రీ-పోస్టుమార్టం చేస్తున్నారని, మరి గత 90 రోజులుగా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "మా డిమాండ్లను, కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లూ జాప్యం చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా నిందితులకు కొమ్ముకాయడమే" అని దుయ్యబట్టారు. ​అధికారుల కుట్రలను బట్టబయలు చేస్తాం: రీ-పోస్టుమార్టం నివేదికలో కేవలం వాస్తవాలు మాత్రమే ఉండాలని, న్యాయం గెలిచేలా రిపోర్టు ఉండాలని మంద కృష్ణ స్పష్టం చేశారు. "పై అధికారులు ఇప్పటికే ఈ కేసును తారుమారు చేసేందుకు కుట్రలకు తెరలేపారు. ఒకవేళ ఎవరైనా నివేదికను ప్రభావితం చేయాలని చూస్తే, అన్ని ఆధారాలతో సహా వారిని బట్టబయలు చేస్తాం" అని హెచ్చరించారు. ​నివేదికపైనే అందరి దృష్టి: బీబీనగర్ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ప్రగ్నేష్ పార్మర్ బృందం అందించే నివేదిక ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని మంద కృష్ణ తెలిపారు. రాజేష్ కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు, దోషులు కటకటాల వెనక్కి వెళ్లే వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :