DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ SPS అసోసియేషన్ ఆధ్వర్యంలో..... హైదరాబాద్ హెల్త్ కమిషనర్ కార్యాలయం నందు Dr. J. అజయ్ కుమార్ గారిని కమిషనర్ గారిని కలసి రాష్ట్రంలో 33 జిల్లాల నందు ప్రభుత్వ హాస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ , పేషంట్ కేర్ , సెక్రటరీ గార్డ్స్ , సూపర్వైజర్స్ 17000 మంది కార్మికుల జీవన ఉపాధి మీద ప్రభుత్వాలు చొరవ తీసుకొని కనీస వేతనం 26000/- ఇవ్వాలి అని రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేసినారు. కాంటాక్ట్ వ్యవస్థ రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే ప్రతి కార్మికుడికి వేతనాలు ఇవ్వాలి అని తద్వారానే కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులు సంతృప్తితో జీవించగలరు అని తెలియపరచినారు. అనంతరం హైదరాబాద్ హెల్త్ కమిషనర్ గారిని ఆఫీసు నందు కలిసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చినారు 1. కాంట్రాక్టు దళారు వ్యవస్థ రద్దు చేయాలి. 2. ప్రతి కార్మికునికి 26OOO/- వేతనం ఇవ్వాలి 3. ప్రతి కార్మికుడికి ESI కార్డ్స్ ఇవ్వాలి 4. ప్రతి కార్మికుడు వేతనం నుండి డబల్ PF కాకుండా కార్మికుడు ద్వారా ఒకటి ప్రభుత్వం ద్వారా ఒకటి చెల్లించాలి. 5. ప్రతి కార్మికునికి ఇప్పుడు ఉన్న 4 సెలవు దినములతో పాటు 2 CL లు కల్పించాలి 6. ప్రాముఖ్యంగా మహిళా కార్మికులకు వేతనముతో కూడిన ప్రస్తుతి సెలవు దినములు ఇవ్వాలి 7. కార్మికుడు విధి నిర్వహణకు వచ్చేటప్పుడు కానీ డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే 5,00,000/- లక్షల పరిహారం చెల్లించాలి. 8. ప్రమాదం జరిగిన కార్మికుల కుటుంబంలో ఒకరిగా ఉద్యోగం ఇవ్వాలి. ఈ విధముగా కూడిన డిమాండ్స్ మెమోరండం ఇవ్వటం జరిగినది. ఈ విషయం గురించి కమిషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ గత 2022 సంవత్సరం తర్వాత వేతనాల పర్సంటేజ్ పెరగలేదు అని ఇప్పుడు తప్పకుండా అవకాశం ఉంటుంది. మీ యొక్క అంశం గురించి ప్రభుత్వంతో చర్చించి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని సానుకూలంగా స్పందించినారు. పై ఈ విధంగా కార్మికులకు కనీస వేతనాలు పెరగనీ ఎడల తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నందు పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పటల్ శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్రటరీ గార్డ్ , సూపర్వైజర్స్ మహా ధర్నాకు పిలుపునివ్వడం జరుగుతది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బొస్కా .నరేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమా రాష్ట్ర కార్యదర్శి అంజలి , నాగరాజు, ప్రవీణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాతంగి అనిల్ కుమార్, నరేష్, కుమారి, రేణుక, సైదులు, రాజేందర్, శివ పవన్
Admin
DNB News