DNB News - తెలంగాణ / : కేబుల్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తెలంగాణ I&PR (సమాచార & ప్రజాసంబంధాల) కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ కి విన్నతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో JAC కన్వీనర్: డాక్టర్ బరిగెల శివ కోఆర్డినేటర్: చారి కేబుల్ అసోసియేషన్ ఓనర్స్ & సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 252 జీవో గురించి ఉన్న సమస్యలు, అభ్యంతరాలు మరియు కేబుల్ ఓనర్లపై పడుతున్న ప్రభావాన్ని స్పష్టంగా రాతపూర్వకంగా వివరించి అధికారులకు అందజేశారు. కేబుల్ రంగం మనుగడ, ఉపాధి భద్రత,ప్రజలకు సమాచార హక్కు పరిరక్షణ దృష్ట్యా ఈ జీవోను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని JAC నేతలు విజ్ఞప్తి చేశారు. అధికారులు విన్నతి పత్రాన్ని స్వీకరించి,విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు JAC ప్రతినిధులు తెలిపారు.
Admin
DNB News