DNB News - తెలంగాణ / : హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రమాద బీమా, సమగ్ర ఆరోగ్య పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి A. Revanth Reddyకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలుగా అభివర్ణించారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,998 రకాల వ్యాధులకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి తేవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (JAC), తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, వి. లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరారు.
Admin
DNB News