DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ స్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురైనందున ఆట్టి స్థలాన్ని సర్వేచేసి హద్దులు ఏర్పాటుచేయాలని, గ్రామపంచాయతీ లెటర్ ప్యాడ్ పై గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి తహసిల్దార్ వి సరిత,కు వినతి పత్రాన్ని అందజేశారు,ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ,వేండ్లనాటి ముస్లిం మైనార్టీ స్మశానవాటిక,ను ఆస్థలం పక్కన ఉన్న, రైతులు ఆక్రమణ చేశారని, ముస్లింల స్మశానవాటిక లేక ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని, వారిసమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, తహసిల్దార్ కు వివరించడం జరిగిందన్నారు,ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి, మాజీ సర్పంచ్ సిర్ర శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవ చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీనాయకులు పనస శంకర్, సిపిఎం పార్టీ గ్రామశాఖనాయకులుఅనంతు కోటిలింగం, సురభి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News