Wednesday, 17 June 2026 02:13:20 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కారు

Date : 10 March 2026 10:58 AM Views : 60

DNB News - తెలంగాణ / : సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్స్ కార్యాలయానికి చెందిన ఎస్సై ప్రమోద్ గౌడ్, ఆర్‌ఎస్సై జతావత్ బాబు నాయక్ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 (పూర్వం సీఆర్‌పీసీ 41ఏ) ప్రకారం నోటీసులు ఇవ్వాలని నిందితుడి తరఫువారు కోరినట్లు సమాచారం. అయితే అందుకు రూ.లక్ష ఇవ్వాలని ఈ ఇద్దరు అధికారులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడి తరఫువారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలో డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన ఆర్‌ఎస్సై జతావత్ బాబు నాయక్ డబ్బులు తీసుకుంటున్న సమయంలో ముందుగానే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఎస్సై ప్రమోద్ గౌడ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు వెల్లడించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :