Monday, 15 June 2026 01:43:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దేశంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేత ముప్పాల లక్ష్మణ రావు అలియాస్ గణపతి

Date : 11 March 2026 11:07 AM Views : 57

DNB News - తెలంగాణ / : త్వరలో లొంగిపోవచ్చనే వార్తలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరిగా ఉన్న గణపతి తలపై మూడు కోట్లకు పైగా బహుమతి ఉంది. గతంలో National Investigation Agency కూడా ఆయనపై రివార్డు ప్రకటించి దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టినా పట్టుకోలేకపోయింది. దాదాపు 50 సంవత్సరాల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి, ఆపరేషన్ కగర్ తర్వాత అండర్‌గ్రౌండ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన నేపాల్లో ఆశ్రయం తీసుకున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం గణపతి నేపాల్ నుంచి న్యూ ఢిల్లీకు చేరుకున్నట్లు సమాచారం. ఆయన లొంగుబాటు విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గణపతి లొంగిపోతే దేశంలోని మావోయిస్టు అగ్ర నాయకత్వానికి ఒక యుగానికి ముగింపు పలికినట్లవుతుందని, మావోయిస్టు సాయుధ ఉద్యమానికి పెద్ద దెబ్బ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. వయసు మరియు ఆరోగ్య సమస్యల కారణంగా గణపతి గత కొంతకాలంగా తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఆయనతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గణపతి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక పెద్ద మావోయిస్టు దాడులు జరిగాయి. ఆయన మావోయిస్టు నెట్‌వర్క్‌ను దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో ఆయనను “టీచర్” అని పిలిచేవారు. నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య తరువాత మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక నాయకుడిగా గణపతి ఎదిగారు. ఆయన భార్య సుజాత కూడా ఇప్పటికీ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. గణపతి స్వస్థలం తెలంగాణలోని సారంగాపూర్, జగిత్యాల జిల్లా. ఇటీవల మావోయిస్టు నేతలు దేవుజీ, చొక్కారావు తదితరులు లొంగుబాటు చేసిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ, ఐజీపీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమై మావోయిస్టుల లొంగుబాటుపై చర్చించినట్లు సమాచారం. గణపతి లొంగుబాటు జరిగితే దేశంలోని మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అది కీలక మలుపుగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :