DNB News - తెలంగాణ / : మునగాల మండలం నరసింహపురం గ్రామపంచాయతీ పరిధిలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల పాటు జరిగే ప్రజాపాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచన మేరకు మహిళ వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా మహిళల కోసం నిర్మిస్తున్న స్వయం శక్తి భవనం. స్లాబ్. పూర్తయిన సందర్భంగా. ఆ భవనం వద్ద మామిడి తోరణాలతో. పూల అలంకరణలతో. అరటి మరియు కొబ్బరి మట్టలతో. అలంకరించి. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళల కోసం ప్రత్యేకంగా. 10 లక్షల రూపాయల వ్యయంతో. నిర్మిస్తున్న భవనం స్లాబ్ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో మహిళలకు అందుబాటులో రానుందని. అలాగే మహిళలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా. ముందుకు వెళ్లడం కోసం. ప్రభుత్వాలు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిందని. అలాగే వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని. స్వయం ఉపాధితో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం. ఇప్పటికే వారికి. సమ భావన సంఘాల లో సభ్యులుగా ఉన్న వారికి. అధిక మొత్తంలో. రుణాలు ఇస్తున్నారని అలాగే వారికి. స్వయం ఉపాధి కోసం ముద్ర లోన్లు మరియు ఇతరత్రా లోన్లు ఇవ్వడమే కాకుండా ఉమ్మడిగా వారికి అనేక రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందేందుకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు షేక్ అజీజ్ మియా వీరబోయిన నరేష్ రేవూరి కళ్యాణి బాబు మీసాల బిక్షం పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు. వీవోఏ సమీనా. సమబావన సంఘం మహిళలు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News