Monday, 15 June 2026 01:40:56 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ముగింపు దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారహోరు అధికార కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత?

Date : 09 February 2026 04:44 PM Views : 86

DNB News - తెలంగాణ / : అశ్వారావుపేట : గత 30 సంవత్సరాల నుండి తెరచాటు నుండి మనల్ని పరిపాలించిన ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు మున్సిపల్ పీఠంపై కన్నేశారని, ఇప్పటికే అశ్వారావుపేటలో వారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసునని సామాన్య ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రెండు సంవత్సరాల నుండి మమ్మల్ని దుబ్బా ధూళి మింగిస్తున్న వారు పోలీస్ స్టేషన్లను, రెవిన్యూ ఆఫీసులను తన గుప్పెట్లో పెట్టుకొని సామాన్యుల హక్కులను హరించడమే కాకుండా ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు వాపోతున్నారు. వంద ఓట్లు కూడా లేని వారిని తమ స్వప్రయోజనాల కోసం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచులుగా చేసి తమ పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు మున్సిపల్ పీఠంపై కన్నేసారని, అశ్వారావుపేట రింగ్ రోడ్ లో ముస్లింలను చిన్నచిన్న కార్మికులను ఒక దళితులకు చెందిన భూమిపై ఇబ్బందులు సృష్టించి, రింగ్ రోడ్డు రాజకీయం ఎలా జరిగిందో తెలుసునని, అశ్వారావుపేట ప్రజల 25 ఏళ్ల కళ నెరవేరుస్తానంటూ నారాయణరావు ఎస్టేట్ అంటూ ప్రగల్బాలు పలికిన వీరు 300 మంది పేదలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటే రెండు సంవత్సరాల తర్వాత కనీసం నోటీసు కూడా లేకుండా జెసిబి లతో పోలీస్ పహారాల్లో నేలమట్టం చేసిన చరిత్ర మరువరానిదని, మరలా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం నాలుగు వేల మందికి శాశ్వత భవనాలు నిర్మిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గతంలో వీరి హయాంలోనే దొంతుకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ అంటూ రెండు కోట్లు కాజేసిన సంగతి గుర్తు చేసుకోవాలని, మరలా ఇప్పుడు అదే రింగుబడ్డకు మరో ఐదు కోట్లు అంటూ ఇంకా అనేక హామీలతో ముందుకు వస్తున్నారని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సేవ్ అశ్వారావుపేట అని ఉద్యమాలు చేసిన దుస్థితి అశ్వారావుపేట ప్రజలకు వచ్చిందని, అవేమీ పట్టించుకోని నేతలు కొందరు అధికారం కోసం మున్సిపాలిటీ అభివృద్ధికి 45 కోట్లు ఖర్చు పెడతామంటూ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, అనేక వాగ్దానాలు చేస్తూనే పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, అటువంటప్పుడు మోసపూరిత వాగ్దానాలు చేయాల్సిన అవసరం ఏముందని, గెలిచినా ఓడినా అశ్వారావుపేట అభివృద్ధి చేయొచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గెలుపు కోసం బెదిరింపులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన కోట్లాది రూపాయల సిసి రోడ్లు నిధులను ఖర్చుపెట్టి మేమే తీసుకొచ్చామని చెప్పుకోవడం మరీ విడ్డూరంగా ఉందని, అశ్వారావుపేటలో ఇప్పుడు నడుస్తున్న సెంట్రల్ లైటింగ్, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఆర్టీవో ఆఫీస్, ఇంకా అనేక రకాల సదుపాయాలను బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అశ్వారావుపేటకు వచ్చాయని, బిఆర్ఎస్ పునాదుల మీద రిబ్బన్ కటింగ్ చేస్తూ మేమే చేశామని ప్రగల్బాలు పలకటం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అని చెప్పుకుంటున్న నేతలు మునిసిపల్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి కనీసం ఎన్నికలు జరుగుతున్నాయి కదా అశ్వారావుపేట ప్రజలకు దుమ్ము దూళిని దూరం చేద్దామనే ధ్యాస కూడా లేదని, రింగ్ రోడ్ లో ఆ దుబ్బ లోనే ప్రజలు మునిగి తేలుతున్నారని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీని ఉద్ధరించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పదవుల కోసం ముందుకు వచ్చామని చెప్పుకుంటున్న వీరు ఇప్పటివరకు అశ్వారావుపేట అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు అనగానే అశ్వారావుపేట అభివృద్ధి గుర్తొచ్చిందా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇటువంటి దోపిడీ శక్తులను దళారి శక్తులను ఓడించే సమయం అవకాశం అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజలకు వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనే ఇటువంటి శక్తులు అధికార పీఠం మీద కూర్చోకుండా వ్యతిరేక ఓటు వేసే అవకాశం కోసం అశ్వారావుపేట ప్రజలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ఓటును సద్వినియోగం చేసి అశ్వారావుపేట మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపే విధంగా ఓటును సద్వినియోగం చేసి దుష్టశక్తులకు ప్రజా వ్యతిరేకులకు అవకాశం లేకుండా అభివృద్ధిని కాంక్షిస్తున్న వారికే ఓటు వేసి మున్సిపల్ ఎన్నికలలో విజయాన్ని అందించాలని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :