DNB News - తెలంగాణ / : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అధికారులు ఆమె నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతంలో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు సీబీఐ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Admin
DNB News