DNB News - తెలంగాణ / : మునగాల మండల కేంద్రం గ్రంధాలయంలోఅఖిలపక్షం సమావేశంజరిగిందిసమావేశానికి,పాతకోట్లనాగరాజు మాదిగఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి అధ్యక్షత వహించారు ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేల్పుల సురన్న మున్నూరు కాపు బొర్ర భిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్, జాతీయఅధికార ప్రతినిధి,లు మాట్లాడుతూ, కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో నాటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,సూర్యాపేట ఎస్పీ నరసింహ గారి పాత్ర ఉందని అన్నారు.నిజానికి కర్ల రాజేష్ ను అక్రమంగా ఏ పిర్యాదు లేకుండా చట్టవిరుద్ధంగా చిలుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం డీఎస్పీ,ఎస్పీ లకు తెలుసు అని అన్నారు.ప్రతి రోజూ పోలీసు స్టేషన్ లాకప్ లకు సంబంధించిన సమాచారం ( డైలీ సిట్యువేషన్ రిపోర్ట్) ఎస్పీ, డీఎస్పీలకు ఉన్నప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేసి రాజేష్ మరణానికీ వారు కూడా కారకులయ్యారు అని అన్నారు. అంతేకాదు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు మొదటి నుండి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారని అన్నారు.అందులో బాగానే రాజేష్ పోస్టుమార్టం కు ముందు ఎస్పీ నరసింహ గాంధీ హాస్పిటల్ కు ఎస్ఐ సీఐ లను పంపించారని అన్నారు.పోలీసులే గాంధీ హాస్పిటల్ లో డాక్టర్లను , మరియు ముషీరాబాద్ మెజిస్ట్రేట్ ను మేనేజ్ చేసి పోస్టుమార్టం చేయించుకున్నారు .అందుకే ఆ రోజు డ్యూటీలో లేని లక్ష్మీకాంత్ రెడ్డి అనే రెడ్డి డాక్టర్ ను పిలిపించి పోస్టుమార్టం చేయించారు. వీడియో గ్రాఫర్ ను కూడా కోదాడ నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ రెడ్డి ని పిలిపించారని అన్నారు. అందువలన ఈ కేసును కప్పిపుచ్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడంతో తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని A3 గా, ఎస్పీ నరసింహను A 4 గా రాజేష్ లాకప్ డెత్ కేసులో చేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖకు నిజాయితీ ఉంటే ఈ ఘటన మీద ప్రధానంగా డీఎస్పీ ఎస్పీ పాత్రల మీద డిఐజి లేదా ఐజి లేదా అంతకన్నా ఉన్నతస్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు ఉత్తంకుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు దళితుల పక్షమా లేక రెడ్ల పక్షమో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే కలెక్టరేట్ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గనాయకులు సుంకరి అజయ్ కుమార్, ఎంఎస్పి జిల్లాప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోగరు రమేష్, సిపిఐ మండల నాయకులు సిహెచ్ సీతారాం,బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య, ఎంఎస్పి మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను,బిజెపి పార్టీమండలఉపాధ్యక్షులు గోవింద చారి,బిఆర్ఎస్ పార్టీ మునగాల పట్టణ అధ్యక్షులు ఉడుం కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు గడ్డం లింగయ్య,ఎల్పి నాగబాబు,కోదాడ బీసీ సంఘంనాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి లింగరాజు, రేపాల గ్రామ శాఖ అధ్యక్షులు మేరీగ వెంకటేశ్వర్లు, సాయి,రామరాజుతదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News