DNB News - తెలంగాణ / : ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో మునగాల మండల యువతకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో యువత, విద్యార్థులు అక్రమ ఐపీఎల్ బెట్టింగ్ యాప్‌లకు బానిసలవుతున్నారని,దీంతో అప్పులపాలు కావడంతో పాటు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు.ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వెనుక ప్రమాదకర మాల్‌వేర్ ఉండే అవకాశం ఉందని, ఫేక్ లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి యువత, విద్యార్థులు ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నా లేదా నిర్వహిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచి,బెట్టింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు.
Admin
DNB News