DNB News - తెలంగాణ / : * గంజాయి అనే రాకాసి కోరల్లో చిక్కుకొని పచ్చని పల్లెలు విలవిల? * శనివారం పట్టపగలు సత్యనారాయణపురం కాలనీ లో గంజాయి మత్తులో పెళ్లి మండపం లో గంజాయి బ్యాచ్ వీరంగం * పెళ్ళికొడుకు పై దాడికి యత్నం * బందించి రెడ్ హ్యాండెడ్ గా గంజాయి తో సహా పోకిరీలను పోలిస్ లకు పట్టించిన స్థానికులు * కూపీ లాగితే బడాబాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం? * గంజాయి బ్యాచ్ ను కాపాడే ప్రయత్నం లో అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు? * గంజాయి బ్యాచ్ లకు సహాయ సహకారాలు అందిస్తున్న అధికార, ప్రతిపక్ష నాయకుల పై పార్టీ ఆధినాయకత్వం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్న ప్రజలు * గంజాయి బ్యాచ్ లకు కౌన్సిలింగ్ లతో కాలయాపనలకే పరిమితమైన పోలీస్ లు? * ఉక్కుపాదం తో అనిచేది ఎప్పుడో? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం కాలనీ లో జరిగిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ రహిత తెలంగాణగా చూడాలనే కల కల్ల గానే మిగిలే విధంగా ఉన్నాయి, రాష్ట్రం లో జరిగే కొన్ని సంఘటనలు, మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం లో గంజాయి వినియోగం యదేచ్చగా సాగుతుంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు, పల్లె పట్టణం అనే తేడా లేకుండా పచ్చని పల్లెలో కూడా విస్తరించిన గంజాయి సాగు మరియు వినియోగం, యవ్వన, దశలోనే యువత మత్తులో చిత్తవుతుంది, శనివారం పట్టపగలు బయ్యారం మండలం సత్యనారాయణపురం కాలనీ లో గంజాయి మత్తులో యువకులు పెల్లిమండపం లో పెళ్ళికొడుకు పై దాడికి యత్నం, బందించి రెడ్ హ్యాండెడ్ గా గంజాయి తో సహా గంజాయి బ్యాచ్ ను పోలిస్ లకు పట్టించిన ప్రజలు, మొన్న ఇదే బయ్యరం మండలం లో గంజాయి మత్తులో పెట్రోలింగ్ కానిస్టేబుళ్ల పై దాడి చేసిన ఘటనను మరువకముందే మరో ఉదంతం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది, గంజాయి మత్తు లో యువత అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, అదికారురు కౌన్సిలింగ్ లతో సరిపెడుతున్నారని, పూర్తిగా అదుపు తప్పక ముందే కటిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు, గంజాయి బ్యాచ్ ను బయ్యారం మండలం లో ఉక్కుపాదం తో అణచివేయాలని ప్రజలు పోలీస్ లను మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
Admin
DNB News