Monday, 15 June 2026 02:18:55 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు?

Date : 24 March 2026 03:53 PM Views : 45

DNB News - తెలంగాణ / : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు,(ఎలియాస్ సున్నం చంద్రయ్య) పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రూ. 25 లక్షల రివార్డు.. భారీ వ్యూహం పాపారావుపై ప్రభుత్వం రూ. 25 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. ఆయన లొంగుబాటుకు సంబంధించి ఇప్పటికే మధ్యవర్తులు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.. సుమారు 12 నుంచి 17 మంది తన సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. భద్రతా బలగాలు ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే, మరోవైపు మావోయిస్టు నేతలు లొంగిపోయేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ పరిణామాలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దృఢ సంకల్పంతో దేశంలో నక్సలిజంపై పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగు తోంది. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పాపారావు వంటి అగ్రశ్రేణి కమాండర్లు లొంగిపోవడం ఒక సానుకూల సంకేతం. నక్సలిజం నిర్మూలనకు గడువు దగ్గర పడింది.అని ఆయన పేర్కొన్నారు. అధికారిక ప్రకటన కోసం నిరీక్షణ పాపారావు లొంగుబాటుపై పోలీసు ఉన్నతాధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించా ల్సి ఉంది. ఆయన లొంగి పోతే బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు పూర్తిగా సడలే అవకాశం ఉందని రక్షణ రంగ నిపు ణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించడం లేదా? లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతోంది. నక్సలిజం నిర్మూలనకు గడువు దగ్గర పడింది అందుకే పాపారావు,వంటి ప్రముఖ మహోయిస్టు కమాండర్లు లొంగిపోవడం దీనికి సానుకూల సంకేతం.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :