DNB News - తెలంగాణ / : కొత్తగూడెం కార్పొరేషన్ పరిది 17వార్డులో 77 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో మాజీ కౌన్సిలర్ మోరే రూప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 17 డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి మోరే రమేష్ స్థానిక నాయకులు, చిన్నారులతో కలసి రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రజాస్వామ్మ ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.
Admin
DNB News