DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గవర్నర్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపరేశ్ కుమార్ సింగ్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ప్రత్యేకంగా శివ్ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు IAS, డీజీపీ శివధర్ రెడ్డి IPS సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News