DNB News - తెలంగాణ / : శ్రీ కోదండరామాస్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం నిండిన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలు, మహిళలు,యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్చార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించి,గ్రామస్థులకు వారి వారి పేర్ల ఆధారంగా రాశి ఫలితాలను వివరించారు. కొత్త సంవత్సరంలో కలగబోయే శుభాశుభ ఫలితాలు, గ్రహగతులు,వ్యవసాయ పరిస్థితులు,ఆరోగ్య పరిరక్షణ, విద్యాఅవకాశాలు,ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై సమగ్రంగా విశ్లేషణ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ప్రముఖ పారిశ్రామికవేత్త, నల్లపాటి శ్రీనివాస్. ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్,దేవినేని సీతారామయ్య, వంగవీటి గురుమూర్తి, మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, టి వి డి ప్రసాద్, వాసా శ్రీనివాసరావు, దేవినేని రవి,శెట్టిగిరి, తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News