DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. 53వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ముదoగుల మహేష్ గెలుపు కాంక్షిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అందరూ ప్రతి రోజు వచ్చి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి డివిజన్‌లో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముదoగుల మహేష్ మాట్లాడుతూ విద్యావంతుడు, సేవాభావం కలిగిన యువ నాయకుడు ముదoగుల మహేష్ డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడని అన్నారు. మహేష్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారంతో 53వ డివిజన్‌లో నూతన ఉత్సాహం నెలకొందని మహేష్ కు ప్రజల మద్దతు మరింత బలపడుతోందని స్థానికులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి యువ నాయకత్వానికి ప్రజలు అండగా నిలుస్తారని బీఆర్ఎస్ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశాయి.
Admin
DNB News