DNB News - తెలంగాణ / : కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ. పదవ వార్డులో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిండా హరిబాబు ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. పదవ వార్డులోని ప్రతి వీధి, ప్రతి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు
Admin
DNB News