Wednesday, 17 June 2026 03:07:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల విజయం

Date : 30 April 2026 11:37 AM Views : 38

DNB News - తెలంగాణ / : విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ వారిని సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ వారి కలలను సహకారం చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విలేకరుల సమావేశానికి మరియు అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు‌ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రకటించినటువంటి పదవ తరగతి ఫలితాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పై చెయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించడం అల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతికాని వారు గుర్తు చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ తరగతి గదిలో బోధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు వైపు పయనించాలని వారు సూచించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఆర్‌.సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఓ.ఆద్య, టి.రాజు, బి‌.అక్షిత్ రెడ్డి, 588 మార్కులు సాధించారని, 1274 మంది విద్యార్థులకు 1026 విద్యార్థులు 500 మార్కులు పైన సాధించడం చాలా స్ఫూర్తిదాయకమని చెప్పారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా సాధించారని మరియు 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించడం చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు అద్భుతమైన విజయాల సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అనునిత్యం వారి పిల్లలకు ప్రోత్సాహం అందిస్తూ లక్ష్యాల వైపు పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు వారి పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు మరియు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధింపచేసినందుకు నరేందర్ రెడ్డి ని తల్లిదండ్రులు ప్రశంసిస్తూ అభినందించారు మరియు ఘనంగా సత్కరించారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: